కొదమ సింహం మళ్లీ వస్తోంది.. రీ రిలీజ్ ఎపుడంటే?

కొదమ సింహం మళ్లీ వస్తోంది.. రీ రిలీజ్ ఎపుడంటే?

తన కెరీర్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ సినిమా ‘కొదమ సింహం’. రాధ, సోనమ్, వాణీ విశ్వనాథ్‌‌‌‌లు హీరోయిన్స్‌‌‌‌గా నటించగా, కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించారు.  కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు నిర్మించారు. 

 ముప్ఫై ఐదేళ్ల తర్వాత ఇప్పుడీ సినిమా రీ రిలీజ్‌‌‌‌కు రెడీ అవుతోంది. ఈ నెల 21న విడుదల కాబోతోంది.  బుధవారం ఈ రీ రిలీజ్ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను చిరంజీవి సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేశారు.  వింటేజ్ మెగాస్టార్ స్టైల్, స్వాగ్, అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో సాగే ఈ చిత్రాన్ని 4కే కన్వర్షన్ క్వాలిటీ, 5.1 డిజిటల్ సౌండింగ్‌‌‌‌తో  ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు తెలియజేశారు.