
హైదరాబాద్, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాజీ ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. గురువారం ప్రజాభవన్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఉద్యోగాల భర్తీపై, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్న జాబ్ క్యాలెండర్‌పై చర్చించారు.
ప్రజా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేస్తూ రాబోయే రోజుల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాలు, వీటితో పాటు నిరుద్యోగుల కోసం సమగ్ర ఉపాధి కల్పన విధానం కూడా ఈ భేటీలో చర్చకొచ్చింది.