
మంచిర్యాల జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జల సాధన సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ‘మా నీళ్లు మాకు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుమ్మిడి హెట్టి దగ్గరే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. “పెండింగులో వున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణలను పూర్తి చెయ్యాలి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కడితేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. తుమ్మిడి హెట్టి దగ్గరే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసిరావాలి. త్వరలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణ పోరాటంపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం” అని కోదండరామ్ చెప్పారు.