పహల్గాం దాడిని ఖండిస్తున్నాం..దోషులను వదలొద్దు..ప్రధానిమోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్

పహల్గాం దాడిని ఖండిస్తున్నాం..దోషులను వదలొద్దు..ప్రధానిమోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్

పహల్గాం ఉగ్రదాడిని  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. సోమవారం( మే5) ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు పుతిన్. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.  ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడి నేరస్థులను చట్టం ముందుకు నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. 

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన టెర్రరిస్టుల దాడిలో అమాయకపు 26 మంది టూరిస్టులు చనిపోయిన తర్వాత ప్రపంప దేశాలు భారత్ బాసటగా నిలిచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ తో సహా పలు దేశాల అధినేతలు ప్రధానిమోదీకి ఫోన్ సంఘీభావం తెలిపారు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి పహల్గాం దాడి, తదనంతరం జరిగిన పరిణామాలపై చర్చించారు. 

‘‘రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేసి పహల్గాం దాడిని ఖండించారు.  అమాయల ప్రాణనష్టంపై తీవ్ర సంతాపం వ్యక్తం  చరేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ కు రష్యా మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ దారుణానికి కారణమైన వారిని, వారికి మద్దతు ఇచ్చిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారంటూ’’ MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ X లో పోస్ట్ షేర్ చేశారు.