నిరుద్యోగులకు ATC సెంటర్ ద్వారా తక్కువ కాలంలోనే జాబ్స్: ఎంపీ వంశీ

నిరుద్యోగులకు ATC సెంటర్ ద్వారా తక్కువ కాలంలోనే జాబ్స్: ఎంపీ వంశీ

మంచిర్యాల: 10వ తరగతి పాసై ఇంటర్, డిగ్రీ, బీటెక్‎లు చదువుకోలేని విద్యార్థులకు ఏటీసీ సెంటర్ ద్వారా తక్కువ కాలంలోనే ఉద్యోగాలు వస్తాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల స్కిల్స్ వెలికితీసేందుకే ఏటీసీ సెంటర్లు ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.  మందమర్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్‎ను ఎంపీ వంశీ సోమవారం (మే 5) సందర్శించారు. ఆ తర్వాత మంచిర్యాల కలెక్టరేట్‎లో  తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ శిక్షణ(TASK)కేంద్రాన్ని పరిశీలించారు. 

ఏటీసీ సెంటర్‎లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ పరికరాలను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ మాట్లాడుతూ.. రాష్ట్ర  ప్రభుత్వం, టాటా గ్రూప్ సౌజన్యంతో జిల్లా వ్యాప్తంగా నాలుగు ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నాలుగు ఏటీసీ సెంటర్ల ద్వారా సంవత్సరానికి 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 

►ALSO READ | మీరు తెలంగాణ అందాలు చూడండి: మే 15న పోచంపల్లికి మిస్ వరల్డ్-2025 పోటీదారులు

విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో విద్యను అభ్యసించినప్పుడే తమ లక్ష్యాన్ని సాధించవచ్చని సూచించారు. కష్టపడితేనే ఫలితం ఉంటుందని.. షాట్ టర్మ్ కోర్స్‏లు తీసుకుంటే గోల్ రీచ్ కాలేరని అన్నారు. కాగా, టాటా గ్రూప్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‎లో ఆరు బ్రాంచీలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఏటీసీ సెంటర్‎లో రెండు ఏండ్ల పాటు విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి కల్పించనున్న టాటా టెక్నాలజీ ఇండస్ట్రీస్.