
హిందూ పురాణాల ప్రకారం, సీతా నవమిని జానకి దేవి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. సీతా దేవి పుట్టిన రోజు వేడుకలను దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2025 ) సీతానవమి మే 5) నేపథ్యంలోసోమవారం నాడు సీతా నవమిని జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి కోసం సీతామాతను పూజించడం వల్ల మీ ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుందని పండితులు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున తమ భర్త ఆయువు దీర్ఘకాలం ఉండాలని ఉపవాస దీక్షలు కూడా చేస్తారు.
సీతారాములకు హిందువులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడు.. సీతాదేవి ఆదర్శ భార్యగా పురాణాలు చెబుతున్నాయి. సీతానవమి అంటే వైశాఖ శుద్ద నవమి ( మే 5) రోజుకు చాలా విశిష్టత ఉంది. ఆ రోజున సీతాదేవి జన్మించిందని పండితులు చెబుతున్నారు. ఆరోజున సీతాదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.
Also Read : ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయా
పురాణాల ప్రకారం సీతా దేవి వైశాఖమాసం శుద్ద నవమి రోజున భూలోకంలో అవతరించిందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అందుకే ఈ రోజును ( మే5) సీతా జయంతి లేదా సీతా నవమిగా జరుపుకుంటారు. దీనిని జానకి నవమి అని కూడా అంటారు. ఆ రోజున సీతాదేవిని పూజించడం ద్వారా జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, సద్గుణాలు లభిస్తాయి.ఈ రోజున సీతాదేవిని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
సీతా నవమి శుభముహూర్తం
- సీతానవమి తేది : మే 5 సోమవారం
- సీతానమమి ప్రారంభ సమయం: మే 5 ఉదయం 07.35 గంటలకు
- సీతానవమి ముగింపు ఘడియలు : మే 6 ఉదయం 08.38 గంటలకు
- పూజా సమయం: మే 5 ఉదయం 10.58 నుంచి మధ్యాహ్నం 01.38 వరకు
సీతా నవమి పూజా విధానం
- సీతా నవమి రోజున ( మే 5) సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి.
- దేవుడి మందిరం దగ్గర గంగా జలంతో గాని.. ఆవు పంచకం.. ఆవు పేడతో శుద్ది చేయాలి.
- సీతారాముల విగ్రహాలను కాని.. చిత్రపటాలను కాని ప్రతిష్టించుకోవాలి.
- దీపారాధన చేసి రాముడికి.. సీతాదేవికి పూజ చేసి.. హారతి ఇవ్వాలి.
- జానకి స్తోత్రాన్ని రోజు చదివితే అదృష్టం కలిసి వస్తుంది.
- సీతా నవమి వ్రత కథను పఠించండి.
- సీతాదేవికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
- సాయంత్రం మళ్లీ పూజ చేసి ప్రసాదం స్వీకరించాలి.
సీతాదేవికి 16 రకాల అలంకరణ సామాగ్రిని సమర్పించాలి. ఇలా చేయడం వలన అదృష్టం కలసి వస్తుంది. పాయసం ప్రసాదాన్ని పంచి పెట్టడం వలన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. సీతమ్మ తల్లికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించాలి. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవాలంటే సీతానవమి రోజున రాముడు.. సీతని ఆరాధించి పసుపు ఉండలను సమర్పించాలని పండితులు సూచిస్తున్నారు.