
జమ్ము కశ్మీర్: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా పాకిస్తాన్పై కన్నెర్ర చేసిన భారత్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని భారత్ పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్లో నిలిచిపోయిన ఆరు హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
చీనాబ్ నదిపై 18వందల 56 మెగావాట్ల సామర్థ్యంతో సావల్కోట్ ప్రాజెక్టు నిర్మాణం, వెయ్యి మెగా వాట్ల సామర్థ్యంతో పాకల్ దుల్ ప్రాజెక్టు, 850 మెగావాట్ల సామర్థ్యంతో రాటిల్ ప్రాజెక్టు, 800 మెగావాట్ల సామర్థ్యంతో బుర్సార్ ప్రాజెక్ట్, 624 మెగావాట్ల సామర్థ్యంతో కిరు ప్రాజెక్ట్, 1320 మెగావాట్ల సామర్థ్యంతో చీనాబ్ నదిపైనే కిర్తాయి డ్యాం నిర్మాణాన్ని ముమ్మరంగా పూర్తి చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ ఆరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు పూర్తయితే జమ్ము కశ్మీర్ 10 వేల మెగావాట్ల ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా.. జమ్ము కశ్మీర్లోని చాలా ప్రాంతాలకు సాగు, తాగు నీరు ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే అందే అవకాశం ఉంది.
►ALSO READ | ఎన్నిసార్లు చెప్పాలి.. పబ్లిసిటీ స్టంట్స్ ఆపండి: పహల్గాం ఇష్యూ పిటిషనర్‌పై సుప్రీంకోర్టు సీరియస్
ఇన్నాళ్లూ సింధు నదీ జలాల ఒప్పందం అమల్లో ఉండటంతో సింధు నదిపై ఎలాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేయాలన్నా పాకిస్తాన్కు ఇండియా ఆరు నెలల ముందే చెప్పాల్సి ఉంది. అయితే.. ఇండియా ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఇప్పుడు పాకిస్తాన్కు కనీస సమాచారం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చీనాబ్, జీలం నదులుపై ప్రాజెక్టులను ఇండియా నిర్మించుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీతో గత శనివారం(మే 3, 2025) సమావేశమైన జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించినట్లు సమాచారం.
సింధు నదీ జలాలపై షార్ట్-టర్మ్ ప్లాన్ అమలు చేసి పవర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే జరిగితే.. పాకిస్తాన్కు సింధు నదీ జలాలు దాదాపుగా నిలిపివేసే అవకాశం భారత్కు ఉంటుంది. అంతేకాకుండా.. జమ్ము కశ్మీర్లో మంచి నీటి సరస్సు అయిన వులర్ సరస్సును పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది.
#WATCH | Jammu and Kashmir: Water seen flowing from the Baglihar Hydroelectric Power Project Dam on Chenab River, in Ramban. pic.twitter.com/gIavDIMsby
— ANI (@ANI) May 5, 2025