కమీషన్లు దండుకోవడానికే కేసీఆర్​ కొత్త రాజ్యాంగం

కమీషన్లు దండుకోవడానికే కేసీఆర్​ కొత్త రాజ్యాంగం

గద్వాల/కొత్తకోట, వెలుగు: ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకోవడానికే సీఎం కేసీఆర్​కొత్త రాజ్యాంగం రాస్తా అంటున్నాడని టీజేఎస్​రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్​కోదండరాం విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్మిస్తున్న చిన్నోనిపల్లి రిజర్వాయర్​వద్ద నిర్వాసితులు చేస్తున్న రిలే దీక్షకు సోమవారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రజలకు అవసరం లేని చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రిజర్వాయర్ ఏపీకి నీళ్లు కేటాయించేందుకు చేస్తున్న కుట్రలో భాగమని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే పరిస్థితికి కేసీఆర్ దిగజారాడని మండిపడ్డారు. బలవంతపు భూసేకరణ వంటి కొత్త చట్టాలను రాజ్యాంగంలోకి తేస్తారేమోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారన్నారు. కార్యక్రమంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ఆలూరు ప్రకాష్ గౌడ్, లీడర్లు శ్యాంప్రసాద్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఖాదర్ భాషా, రామ్మోహన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కొత్తకోట మండలం నిర్వేన్​ గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కురుమూర్తి కుటుంబాన్ని కోదండరాం పరామర్శించారు.