
బీజేపీవి మాటలు తప్ప చేతలు లేవన్నారు జనసమితి అధ్యక్షుడు కోదండరాం. దేశాన్ని ఆర్థికంగా వృద్ధి చేస్తామన్న హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశంలో ఎగుమతులు నానాటికి తగ్గిపోతున్నాయని, అంతర్జాతీయంగా మన వస్తువులకు గిరాకీ పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
చేతివృత్తుల వారికి సహాకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు కోదండరాం. ఎరువులు, రసాయనాల ధరలు తగ్గించి వ్యవసాయానికి మేలు చేయాలని సూచించారు. ఈ నెల 13న నాగోల్ లో జనసమితి ప్లీనరి సమావేశం ఉంటుందన్నారు. ప్లీనరి కోసం పలు కమిటీలు వేశామని చెప్పారు. రాజకీయాల్లో మౌలిక మార్పుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు కోదండ రాం…