రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించుకోండి : అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్

రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించుకోండి : అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్

కొడంగల్​, వెలుగు: రాజకీయ పార్టీలు బూత్​లెవెల్ ఏజెంట్ల(బీఎల్ఏలు)ను నియమించుకోవాలని అడిషనల్​కలెక్టర్ లింగ్యానాయక్​సూచించారు. మంగళవారం కొడంగల్ తహసీల్దార్​కార్యాలయంలో వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

 ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, తొలగింపుల పరిశీలిన కోసం బీఎల్ఏలు అవసరమన్నారు. అలాగే 18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. మున్సిపల్ కమిషనర్​బలరాం నాయక్, తహసీల్దార్​ విజయ్​కుమార్, డీటీ అనిత తదితరులు పాల్గొన్నారు.