గవర్నమెంట్​ కాలేజీ స్టూడెట్​కు 958 మార్కులు

గవర్నమెంట్​ కాలేజీ స్టూడెట్​కు 958 మార్కులు

కొడంగల్, వెలుగు: ఇంటర్​మీడియట్ ఫలితాల్లో గవర్నమెంట్​కాలేజీలు, గురుకులాల స్టూడెంట్లు సత్తా చాటారు. వికారాబాద్​జిల్లా కొడంగల్ గవర్నమెంట్ జూనియర్​కాలేజీ సెకండ్​ఇయర్​ స్టూడెంట్ పూజ బైపీసీలో 958 మార్కులు సాధించి టాపర్​గా నిలిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో తమ ఫస్ట్​ఇయర్ స్టూడెంట్లు 66 శాతం, సెకండ్ ఇయర్​స్టూడెంట్లు 50 శాతం పాస్​అయ్యారని కాలేజీ వైస్​ప్రిన్సిపాల్​మదుసూధన్​రెడ్డి తెలిపారు. ఎంపీసీలో కృష్ణకుమార్​ 835, హెచ్ఈసీలో రజిత 843 మార్కులు సాధించారని చెప్పారు. 

గురుకుల స్టూడెంట్ల హవా

గండిపేట: నార్సింగి గురుకుల స్టూడెంట్లు ఇంటర్​ఫలితాల్లో సత్తా చాటారు. ఫస్ట్​ఇయర్​స్టూడెంట్లు 99 శాతం, సెకండ్​ఇయర్​స్టూడెంట్లు100 శాతం ఉత్తీర్ణత సాధించారని కాలేజీ ఆర్సీఓ ఆర్‌‌.శారద, ప్రిన్సిపాల్‌‌ ఎల్‌‌.బి.కృపావరం తెలిపారు.  ఫస్ట్​ఇయర్​బైపీసీలో కె.హాసిని 437 మార్కులు, పి.మధుమిత 437, హరిక 436, ఎంపీసీలో విక్టోరియా రాణి467, సిరిమల్లి 467, భావన 466, ఎన్‌‌.ప్రియాంక 466, ఆర్‌‌.హర్షిత 466 మార్కులు సాధించారని చెప్పారు. సెకండ్​ఇయర్​ఎంపీసీలో బి.తరుణిక 986, జె.గౌరమ్మ 984, బైపీసీలో ఎం.అలేఖ్య 977, వి.నాన్సీ 976 మార్కులు సాధించారని చెప్పారు.