V6 News

వీళ్ల వయస్సు 123 సంవత్సరాలట!.. అధికారుల నిర్వాకం

వీళ్ల వయస్సు 123 సంవత్సరాలట!.. అధికారుల నిర్వాకం

కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో కోడెపాక కోటిలింగాము (44), కోడెపాక పద్మ (42) దంపతులు నెల రోజుల కింద  కొత్త ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాత కార్డు ప్రకారమే దరఖాస్తు చేసుకున్నా కొత్త కార్డులో వారి పుట్టిన సంవత్సరం 01–01–1900 గా అధికారులు నమోదు చేశారు.

కొత్త కార్డు చూసుకున్న దంపతులు ఆ కార్డులో ఉన్న పుట్టిన సంవత్సరం చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఓటరు ఐడీ కార్డులో తమ వయస్సు సరిచేయాలని మళ్లీ స్థానిక తహసీల్దార్  ఆఫీసులో 20 రోజుల కింద దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఇప్పటికీ పుట్టిన సంవత్సరం సరిచేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వెంటనే తమ ఓటరు కార్డులో పుట్టిన సంవత్సరం సరిచేసి ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు.