కోడి రామకృష్ణ అంత్యక్రియలు పూర్తి.. తలకొరివి పెట్టిన పెద్దకూతురు

కోడి రామకృష్ణ అంత్యక్రియలు పూర్తి.. తలకొరివి పెట్టిన పెద్దకూతురు

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమ లెజెండరీ డైరెక్టర్, వందకు పైగా సినిమాలు రూపొందించిన దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ… నిన్న మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో కోడిరామకృష్ణ తుది శ్వాస విడిచారు. ఇవాళ ఉదయం వరకు భౌతిక కాయాన్ని జూబ్లిహిల్స్ లోని సొంత ఇంట్లో ఉంచారు. బంధుమిత్రులు, సినీ ప్రముఖులు కోడిరామకృష్ణకు నివాళులు అర్పించారు.

కోడిరామకృష్ణ అంతిమయాత్రలో అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కోడిరామకృష్ణ అంత్యక్రియలు ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో పూర్తిచేశారు. పెద్ద కూతురు దీప్తి కోడిరామకృష్ణకు తలకొరివి పెట్టారు.