ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో చివరి మూడు టెస్టులకూ దూరంగా కోహ్లీ

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో చివరి మూడు టెస్టులకూ దూరంగా కోహ్లీ
  •         శ్రేయస్ ఔట్‌‌‌‌‌‌‌‌.. ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్ ఇన్

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో చివరి మూడు టెస్టులకు కూడా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతను అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ శనివారం స్పష్టం చేసింది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి కోహ్లీ విదేశాల్లో ఉన్నాడు. ‘విరాట్ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండడని సెలెక్షన్ కమిటీకి ముందుగానే తెలుసు.

అందుకు తగ్గట్టుగా ప్లాన్‌‌‌‌‌‌‌‌ను రెడీ చేసుకుంది. మేమంతా విరాట్ తన కుటుంబ బాధ్యతలను  నెరవేర్చిన తర్వాతే జట్టులోకి తిరిగి రావాలని కోరుకుంటున్నాం’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, నేషనల్ సీనియర్ సెలెక్షన్ కమిటీ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో మిగతా సిరీస్‌‌‌‌‌‌‌‌కు టీమ్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. గాయాలతో రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్‌‌‌‌‌‌‌‌, రవీంద్ర జడేజాను తిరిగి జట్టులో చేర్చింది. అయితే, ఇద్దరికీ బీసీసీఐ మెడికల్ టీమ్‌‌‌‌‌‌‌‌ నుంచి క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ రావాల్సి ఉంటుందని తెలిపింది. రాహుల్‌‌‌‌‌‌‌‌ దాదాపు పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సాధించినట్టు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

మ్యాచ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌కు జడేజా కూడా ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సాధించే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని అంటున్నాయి. మరోవైపు వెన్ను, గజ్జల్లో నొప్పితో ఇబ్బంది పడుతున్న శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు దూరం అయ్యాడు. పేలవ ఫామ్‌‌‌‌‌‌‌‌ కారణంగా అయ్యర్‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పిద్దామని అనుకున్న సెలెక్టర్ల పని మరింత సులువైంది. ఇక 17 మందితో కూడిన టీమ్‌‌‌‌‌‌‌‌లో కొత్తగా బెంగాల్‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చింది.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇటీవల ఇండియా–ఎ, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ లయన్స్‌‌‌‌‌‌‌‌ టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌లో నిలకడగా రాణించిన ఆకాశ్‌‌‌‌‌‌‌‌కు సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. తనుబ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లోనూ సత్తా చాటగలడు. రంజీ ట్రోఫీలో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడుతున్న ఆకాశ్ ఈ నెల 13న నేషనల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో చేరనున్నాడు. రెండో టెస్టుకు రెస్ట్ తీసుకున్న హైదరాబాదీ  మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.  అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్ స్థానంలో అతడిని జట్టులో చేర్చిన సెలెక్టర్లు  లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌరభ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీమ్ నుంచి రిలీజ్‌‌‌‌‌‌‌‌  చేశారు.  

జట్టు:
రోహిత్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), కేఎస్ భరత్ (కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్, సుందర్, కుల్దీప్ యాదవ్,  సిరాజ్, ముకేశ్, ఆకాష్ దీప్.