V6 News

రెండు సెంచరీలు.. రెండో స్థానం: ICC వన్డే ర్యాంకింగ్స్‎లో సెకండ్ ప్లేస్‎కు కోహ్లీ

రెండు సెంచరీలు.. రెండో స్థానం: ICC వన్డే ర్యాంకింగ్స్‎లో సెకండ్ ప్లేస్‎కు కోహ్లీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: టీమిండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మళ్లీ రెండో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి దూసుకొచ్చాడు. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (773) రెండు ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎగబాకాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు సెంచరీలు కొట్టడం అతని ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. 2021 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ చివరిసారి రెండో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. 

రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ (781) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కొనసాగుతున్నాడు. విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య కేవలం ఎనిమిది రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే తేడా ఉంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (723) ఐదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టుకున్నాడు. కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (649) రెండు ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎగబాకి 12వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (655) మూడు ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మెరుగుపడి మూడో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బుమ్రా వరుసగా 13, 20, 25వ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో కొనసాగుతున్నారు.