బీఆర్‌‌‌‌ఎస్ హామీలు ఇస్తది.. అమలు చేయదు

బీఆర్‌‌‌‌ఎస్ హామీలు ఇస్తది.. అమలు చేయదు

జీడిమెట్ల, వెలుగు : బీఆర్ఎస్ హామీలు ఇచ్చి అమలు చేయదని.. ఆ పార్టీని నమ్మొద్దని కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత రెడ్డి తెలిపారు. సెగ్మెంట్ పరిధి నిజాంపేట, ప్రగతినగర్​లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొలను హనుమంత రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ జనాలను మభ్యపెట్టేందుకు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్​ను గెలిపిస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.

ప్రజా సమస్యలను  పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ సీనియర్ నేత కొలను శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్​లో చేరడం తనకు, పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చిందన్నారు. కాకతీయ హిల్స్, అజయ్ అపార్ట్​మెంట్, భవ్యాస్ అపార్ట్ మెంట్, ఈశ్వర్ విల్లాస్ వాసులు తనకు మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందని హనుమంత రెడ్డి తెలిపారు.