చికెన్ వంటకాలు అంటే నాన్ వెజ్ ప్రియులు లొట్టలేస్తారు. ఈ వంటకాల్లో చాలా రకాలు ఉన్నాయి. చికెన్ వంటకాలు స్పైసీగా, ట్యాంగీగా ఉంటాయి. ఇంట్లో విందులు, పార్టీలకు ఇవి సరైనవి. ఇంటి భోజనమే ఇష్టపడేవారు సైతం ఈజీగా ఇంట్లోనే చేసుకోగలరు దీన్ని. మరి ఇందులోని కొల్హాపురి చికెన్.. చెట్టినాడ్ చికెన్ వెరైటీలేంటో చూసేయండి..
కొల్హాపురి చికెన్ తయారీకి కావలసినవి
చికెన్ :1కేజీ
గడ్డపెరుగు: 2/3 కప్పు
పసుపు :1 టీస్పూన్
కారం: సిటీస్పూన్
వెల్లుల్లి ముద్ద :1 టీస్పూన్
ఉప్పు :తగినంత
నిమ్మరసం: 2 టీస్పూన్లు
కొల్హాపురి మసాలా
పల్లీ నూనె: 2 టీ స్పూన్లు
బిర్యానీ ఆకు: 1
దాల్చినచెక్క: 1
లవంగాలు: 6
నల్లమిరియాల పొడి: 1/2 టీస్పూన్
ఉల్లిగడ్డ (తరిగినవి): 2
కొబ్బరిపొడి: 1సిటీస్పూను
టొమాటో తరుగు పెద్దది: 1 పెద్దది
నూనె: 2 టీస్పూ న్లు
కొత్తిమీర :టీస్పూన్
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకొని పసుపు, కారం, వెల్లుల్లి ముద్ద, ఉప్పు, నిమ్మరసం పెరుగు వేసి కలపాలి. అందులో చికెన్ వేసి కలుపుకొని ఒక గంట నానబెట్టాలి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, దాల్చి నచెక్క, లవంగాలు, మిరియాలపొడి, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. తరువాత అందులో కొబ్బరి పొడి వేసి కాసేపు వేగించాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి నిముషాలు వేగించాలి. అవి చల్లారాక మెత్తగా మిక్సీ పట్టాలి. మరో బాండీ తీసుకొని నూనె వేడిచేశాక నానబెట్టిన చికెన్ వేసి 15నిమిషాలు ఉడికించాలి. తరువాత మిక్సీ పట్టిన మసాల పేస్ట్ వేసి సన్నని మంటమీద ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవాలి..
చెట్టినాడ్ చికెన్ తయారీకి కావలసినవి
చికెన్ :1/2 కేజీ
ఉల్లిగడ్డ తరుగు: 1/2కప్పు
టొమాటో తరుగు: 1/4 కప్పు
నూనె: 5 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క :2 ముక్కలు
లవంగాలు: 5
యాలకులు : 3
షాజీర: 2 టీస్పూన్లు
కరివేపాకు: 2 రెమ్మలు
పసుపు :1 టీస్పూన్
ఉప్పు: తగినంత
కొత్తిమీర :2 టీస్పూన్లు
మసాలా పేస్ట్ కోసం
ఉల్లిగడ్డ: 100 గ్రాములు
అల్లం, వెల్లుల్లి,సోంప్ : ఒక్కోటి 50 గ్రాములు
షాజీర: 20 గ్రాములు
, మిరియాలు: 20 గ్రాములు
ఎండుమిర్చి: 4
కొబ్బరి : 100 గ్రాములు
ఉప్పు: తగినంత
తయారీ విధానం: మిక్సీ జార్ లో ఉల్లిగడ్డ, అల్లం,వెల్లుల్లి, సోంప్, షాజీర, మిరియాలు ఉప్పు, ఎండుమిర్చి, కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత చికెన్ ను శుభ్రంగా కడగాలి. ముందుగా తయారు చేసిన పేస్ట్ వేసి నానబెట్టాలి. పొయ్యి మీద బాండీ పెట్టి అందులో నూనె వేడిచేశాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీర వేసి వేగించాలి. ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు వేసి వేగించాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి 5 నిమిషాలు వేగించాలి. అందులో నానబెట్టిన చికెన్, పసుపు వేసి 10నిమిషాలు ఉడికించాలి తరువాత కొంచెం నీళ్లు చిలకరించి, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. కారంగా తినడం ఇష్టమైతే కొంచెం కారం లేదా మిరియాల పొడి చేసు కోవచ్చు. చివరగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేయాలి. . . .
