
కేకేఆర్‌కు చెపాక్ స్టేడియానికి విడదీయరాని సంబంధం ఉంది. ఇదే స్టేడియంలో 2012లో ఆ టీమ్ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. 2014లో బెంగళూరులో రెండో కప్పు అందుకున్న ఆ జట్టు మూడో టైటిల్ కోసం పదేండ్లు ఎదురు చూ సింది. ఆ నిరీక్షణకు మళ్లీ చెపాక్ స్టేడియంలోనే తెరపడింది.
దాంతో తమ విజయయాత్ర మొద లైన చోటనే కేకేఆర్ కథ మళ్లీ మారింది. ఇక, కెప్టెన్‌గా కోల్‌కతాకు తొలి టైటిళ్లు అందించిన గౌతమ్ గంభీర్ ఈ సారి మెంటార్‌గా తెర వెనుక నుంచి జట్టును ముందుకు నడిపించాడు. కెప్టెన్‌గా మెంటార్‌గా ఐపీఎల్ ట్రోఫీలు అందుకున్న క్రికెటర్‌గా రికార్డు కెక్కాడు.