అండర్ వాటర్ మెట్రో కలిగిన మొదటి నగరంగా కోల్ కతా

అండర్ వాటర్ మెట్రో కలిగిన మొదటి నగరంగా కోల్ కతా

దేశంలో నీటి అడుగున మెట్రో రైలు (అండర్ వాటర్ మెట్రో) కలిగిన మొదటి నగరంగా కోల్ కతా రికార్డుకెక్కనుంది. కోల్ కతా మెట్రో రైల్ కార్పోరేషన్ (కేఎంఆర్ సీ) ఆధ్వంర్యంలో ఈస్ట్-వెస్ట్ కారిడార్ లో ఈ ప్రాజెక్ట్ పూర్తవనుంది. హౌరా వయా కోల్ కతా సాల్ట్ లేక్ వరకు మొత్తం 16.55 కి.మీ. ఉండే ఈ  రైలు మార్గం, జూన్ 2023 నాటికళ్లా పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. 

హుగ్లీ నది నీటి అడుగున మెట్రో ట్రైన్ ట్రాక్ నిర్మించారు. అయితే, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పూర్తయి మెట్రో రైలు పట్టాలెక్కాల్సి ఉండగా చిన్న చిన్న కారణాల వల్ల ఆలస్యం జరుగుతుంది. భూగర్భంలో నిర్మిస్తున్న సొరంగ మార్గం వల్ల నది చుట్టు పక్కల ఉన్న ఇండ్లకి పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొన్ని సాంకేతిక ప్రామాదాలు కూడా జరిగాయి. ఇప్పటికే ముప్పావు పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తి చేసి అనుకున్న సమయానికంటే ముందే నీటి అడుగున ప్రయాణాన్ని మొదలు పెడతామని కేఎంఆర్ సీ తెలిపింది.