
కోలీవుడ్ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తండ్రి సుబ్రమణియన్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇవాళ చెన్నై లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అజిత్ కుమార్ తండ్రి మరణించారని తెలిసి ఆయన ఫ్యాన్స్, పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అజిత్ నటించిన సినిమా తునివు. భారీ హిట్ అందుకోగా నెక్స్ట్ ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న ఆయన ఫ్యాన్స్‌కు అజిత్ తండ్రి సుబ్రమణియన్ మృతి వార్త విషాదంలో నింపింది.