Kanguva Sizzle Teaser: కంగువ టీజర్ బీభత్సం..సూర్య నట విశ్వరూపం చూసేయండి

Kanguva Sizzle Teaser: కంగువ టీజర్ బీభత్సం..సూర్య నట విశ్వరూపం చూసేయండి

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌ సినిమాపై అంచనాలు పెంచాయి.

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరోసారి సూర్య నట విశ్వరూపం చూపించాడు. అగ్నితో సెగలు రేపే అటవిక యోధుడిగా సూర్య వైల్డ్ లుక్ ఆకట్టుకుంటోంది. డైలాగ్స్ లేకుండా కట్ చేసిన ఈ టీజర్ లో విజువల్స్, నటి నటుల మైండ్ బ్లాంక్ చేసే లుక్స్ ,సూర్య, బాబీ డియోల్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు గూస్బంప్స్ అని చెప్పాలి. 

Also Read: రాజమౌళి సమర్పణలో ఫహద్‌ ఫాజిల్‌..రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్

ఎంతో క్రూరంగా కనిపించే శవాల గుట్ట, భీకరమైన యుద్ధం, టీజర్ ఎండింగ్లో పెరుమర్చి అనే సూర్య వాయిస్..ఇలా ప్రతిదీ నెక్స్ట్ లెవల్ అనే విధంగా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బాక్గ్రౌండ్ స్కోర్ బీభత్సం అనేలా ఉంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. 

కంగువ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని హీరోయిన్గా నటిస్తోంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా..త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.