Fahadh Faasil: రాజమౌళి సమర్పణలో ఫహద్‌ ఫాజిల్‌..రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్

Fahadh Faasil: రాజమౌళి సమర్పణలో ఫహద్‌ ఫాజిల్‌..రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్

మలయాళం అండ్ తెలుగు,తమిళ చిత్రాలతో వరుస సినిమాలు చేస్తున్న నటుడు అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫహద్ ఫాజిల్..సింపుల్ గా ఫహద్ ఫాజిల్(Fahadh Faasil)గా ఎంతో గుర్తింపు పొందారు. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా మరింత ఫేమస్ అయ్యాడు.  విభిన్నమైన పాత్రలు పోషిస్తూ..తనదైన నటనతో ప్రేక్షకుల మనస్సులో ఫహద్ ఫాజిల్ సినిమాలంటే..ఒక సిగ్నేచర్ మూమెంట్ ని క్రియేట్ చేశాడు. 

లేటెస్ట్గా దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో ఫహద్ ఫాజిల్ హీరోగా ఆర్కా మీడియా కొత్త సినిమాలనుఅనౌన్స్ చేసింది. ఇవాళ (మార్చి 19న) ఈ సినిమాలకు సంబంధించిన టైటిల్స్‌తో పాటు, ఫస్ట్ లుక్ పోస్టర్‌లను షేర్ చేసింది. 

Also Read :కంగువ టీజర్ బీభత్సం..సూర్య నట విశ్వరూపం చూసేయండి

ఫహద్ ఫాజిల్ సినిమాల విషయానికి వస్తే..సిద్ధార్థ్‌ నాదెళ్ల డెబ్యూ డైరెక్టర్ గా ‘ఆక్సిజన్‌’ (OXYGEN) పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఆసక్తికర కథాంశంతో ఈ మూవీ రాబోతోంది. వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఆక్సిజన్‌ తెరెకెక్కిస్తుండగా..శోభ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, కార్తికేయలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శశాంక్‌ యేలేటి డైరెక్షన్లో తెరకెక్కున్న మరో చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ (Dont Trouble The Trouble). ఫన్‌, థ్రిల్‌, ఎమోషన్స్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా..జూన్‌లో షూటింగ్ స్టార్ట్ కానుంది. 

ఇక ఈ రెండు చిత్రాలు తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్నాయి. అంతేకాకుండా ఈ రెండు సినిమాలకి కల భైరవ మ్యూజిక్ అందించబోతున్నాడు. త్వరలో ఈ సినిమాల నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.