బెల్టు షాపులపై ఆదివాసీ మహిళల దాడి

బెల్టు షాపులపై ఆదివాసీ మహిళల దాడి

కుమ్రంభీం జిల్లాలో ఆదివాసీ మహిళలు బెల్టు షాపులపై దాడులు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యాన్ని నిషేదిస్తూ గత నెలలో తీర్మానించారు. అయినా కొందరు బెల్టుషాపులు నిర్వహిస్తుండటంతో.. మహిళలు ఆగ్రహంతో దాడి చేశారు. బెల్టుషాపు నిర్వహకుడికి బొట్లు పెట్టి ఊరేగించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యం అమ్మితే ఊరుకునేది లేదన్నారు. పోలీసులు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని వైన్ షాప్స్ ముందు స్థానికులు ఆందోళన చేశారు. గ్రామంలోకి వెళ్లే మెయిన్ రోడ్డు పక్కన షాప్స్ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వైన్ షాష్స్ ను తొలగించాలని ఎక్సైజ్ అధికారులు, స్థానిక నేతలకు చెప్పినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గ్రామానికి దూరంగా షాప్ ఏర్పాటు చేయాలని కోరారు.