24 గంటల ఉచిత కరెంట్ వల్ల రైతులకు లాభం లేదన్న రేవంత్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సొంత పార్టీ నుంచే గాకుండా ప్రతిపక్ష పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. లేటెస్ట్ గా రేవంత్ వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. రేవంత్ ఏ సందర్భంలో అన్నారో తనకు తెల్వదన్నారు. తన వ్యాఖ్యలపై రేవంత్ క్లారిటీ ఇవ్వాలన్నారు.
రేవంత్ అప్పట్లో కాంగ్రెస్ లో లేరు కాబట్టి ఉచిత విద్యుత్ కోసం ఆయనకు తెల్వదన్నారు కోమటిరెడ్డి. ఉచిత విద్యుత్ కోసం ఎంత కష్టపడ్డామో తమకే తెలుసన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తామని..మేనిఫేస్టోలో పెడతామని చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. నిజంగా ఉచిత విద్యుత్ పై వ్యాఖ్యలు చేసి ఉంటే రేవంత్ వి తప్పేనన్నారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం క్యాండెట్ ను అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు కోమటిరెడ్డి. ఎస్సీ అభ్యర్థిని సీఎం చేయాలా?, ఎస్టీ అభ్యర్థిని సీఎం చేయాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. పార్టీలో 20, 30 ఏళ్ల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారని..ఎవరు సీనియరో..ఎవరు జూనియరో అధిష్టానానికి తెలుసన్నారు.సీతక్క సీఎం అవడం అనేది పెద్ద జోక్ అని అన్నారు.
