ప్రజల తీర్పు సీఎంకు కనువిప్పు కలిగించాలె

ప్రజల తీర్పు సీఎంకు కనువిప్పు కలిగించాలె

హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇవాళ MLA పదవికి  రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ లెటర్ ఇచ్చారు. రాజగోపాల్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. రాజీనామా చేసేముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. " కేసీఆర్ చుట్టూ తెలంగాణ ద్రోహులు ఉన్నారు. ఇచ్చిన ఏ హామీ సీఎం కేసీఆర్ అమలు చేయలేదు.ఎర్రెబెల్లి, పువ్వాడ, గంగుల తెలంగాణ ఉద్యమకారులా?!. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వరా?!. పదవి త్యాగం చేసేది మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం కోసం. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారు. నా రాజీనామా ప్రస్తావన తర్వాతే గట్టుప్పల్ మండలం ప్రకటించారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎవరు చెప్పారు.

మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు సీఎంకు కనువిప్పు కలిగించాలి. తలసాని తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టించలేదా?. నేను చేసేది త్యాగం.. గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు. మునుగోడుతో పాటు చాలా నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయి. మూడున్నారేళ్లుగా నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవటంతోనే మునుగోడు అభివృద్ధి ఆగిపోయింది". అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.