ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారాలంటే.. ప్రభుత్వమే మారాలేమో ! : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారాలంటే.. ప్రభుత్వమే మారాలేమో ! : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
  • కేంద్ర మంతులకు విన్నవించినా మార్పు చేయలేదు
  •  అలైన్ మెంట్ నోటిఫికేషన్ పై సీఎం, ఆఫీసర్లూ చెప్పలేదు
  • ప్రజలకు నష్టం జరిగితే ఊరుకోను.. కొట్లాడుతా.. పదవీ త్యాగం చేస్తా
  • మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డి హాట్ కామెంట్స్

సంస్థాన్​ నారాయణపురం, వెలుగు: “ ట్రిపుల్​ ఆర్​ఉత్తర భాగం అలైన్​మెంట్ ​మారితే.. దక్షిణ భాగం మారుతుంది. ఇవి రెండూ మారాలంటే.. ప్రభుత్వమే మారాలేమో..!” అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడు సెగ్మెంట్ లోని ట్రిపుల్​ఆర్​బాధితులతో ఆదివారం సంస్థాన్​నారాయణపురంలో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ట్రిపుల్​ ఆర్​ఉత్తర భాగం అలైన్​మెంట్​మార్పు కోసం కేంద్ర మంత్రులు నితిన్​ గడ్కరీ, జేపీ నడ్డా, కిషన్​రెడ్డి, బండి సంజయ్​కలిసి విన్నవించానని తెలిపారు.

సీఎం, ఆఫీసర్లు ఎవరూ కూడా సమాచారమివ్వలేదని, హెచ్ఎండీఏ నోటిఫికేషన్​ను పేపర్ లో చూసిన తర్వాతే తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ట్రిపుల్​ఆర్​కారణంగా మునుగోడు నియోజకవర్గ  రైతులే ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపారు. అలైన్​మెంట్ విషయంలో ప్రజలకు అన్యాయం జరిగితే సహించనని, ప్రభుత్వంతో కొట్లాడతానని, అవసరమైతే మళ్లీ పదవీ త్యాగం చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్​లో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.