రేవంత్ రెడ్డి.. నిన్ను ఎప్పటికీ వదల.. ప్రశ్నలు సంధించిన రాజగోపాల్ రెడ్డి

రేవంత్ రెడ్డి.. నిన్ను ఎప్పటికీ వదల.. ప్రశ్నలు సంధించిన రాజగోపాల్ రెడ్డి

బీజేపీ నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ప‌ద‌వుల‌ను అడ్డం పెట్టుకుని  బ్లాక్ మెయిల్ చేసి రేవంత్ వేల కోట్లు దోచుకున్నాడని.. అలాంటి రేవంత్ ఇప్పుడు భాగ్యల‌క్ష్మి గుడి వ‌ద్ద ప్రమాణాలంటే న‌మ్మేదెవ‌రని ప్రశ్నించారు. రాజ‌కీయ వ్యభిచారం చేసే వ్యక్తి రేవంత్ అన్న కోమటిరెడ్డి..   త‌న స్వార్ధం కోసం భాగ్యలక్ష్మి గుడిని కూడా వాడుకోవ‌డం భావ్యం కాదన్నారు. 
 
రాజగోపాల్ రెడ్డి సంధించిన మరిన్ని ప్రశ్నలు ఇవే..

1. టీడీపీ ద్వారా గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరిన రాజకీయ వ్యభిచారివి నువ్వు కాదా రేవంత్. ఈటెల రాజేందర్, నేను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారామే కానీ నీ మాదిరిగా ఒక పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవితో మరో పార్టీలో చేరి రాజకీయ వ్యభిచారం చేయలేదు.
2. కాంగ్రెస్ హైక‌మాండ్  పెద్దలకు డబ్బులు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కోవ‌డం ద్వారా రాజ‌కీయ వ్యభిచారానికి పాల్పడింది  నువ్వు కాదా రేవంత్.  
3.ఓటుకు నోటు కేసులో లక్షల రూపాయ‌ల నోట్ల కట్టలతో రెడ్ హాండెడ్ గా దొరికి జైలుకు వెళ్లిన నీ చరిత్ర రాజ‌కీయ వ్యభిచారం కాదా


4. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి 25 కోట్లు కాంగ్రెస్ కు ముట్టాయని, అయితే అందులో ప‌ది కోట్లు రేవంత్ నొక్కేసాడని కాంగ్రెస్ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్న విష‌యం వాస్తవం  కాదా. మునుగోడులో బిజెపి గెలిస్తే తెలంగాణ‌లో కాంగ్రెస్ ప‌త‌న‌మ‌వుతుంద‌ని, అందుకే న‌న్ను ఓడించేందుకు బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ఆ పార్టీని గెలిపించ‌డం రాజ‌కీయ వ్యభిచారం కాదా రేవంత్.


5.న‌న్ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌, మునుగోడులో న‌న్ను ఓడించేందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా నాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి, 18 వేల కోట్ల అమ్ముడు పోయానంటూ టిఆర్ ఎస్ తో క‌లిసి దుష్ప్రచారం చేయ‌డం రాజ‌కీయ వ్యభిచారం కాదా రేవంత్
6. పార‌ద‌ర్శకంగా జ‌రిగిన‌ గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ లో టెండర్ దక్కితే, ఆ వాస్తవాన్ని దాచి అమ్ముడు పోయానంటూ తప్పుడు ఆరోపణ చేసిన  రేవంత్ .. మ‌రి నీ దగ్గర ఆధారాలుంటే ఎందుకు రుజువు చేయ‌డం లేదు. 

7.నాపై చేసిన ఆరోప‌ణ‌ల‌ను రుజువు చేయ‌క‌పోతే రేవంత్ ను వ‌దిలే ప్రసక్తే లేదు. రాజ‌కీయంగా రేవంత్ ను వేటాడుతా, కోర్టు ద్వారా కూడా రేవంత్ సంగ‌తి తేలుస్తా. నేను దాఖలు చేయ‌నున్న ప‌రువు న‌ష్టం కేసులో ఎప్పటికైనా రేవంత్  జైలుకు వెళ్లడం ఖాయం. 
 

మరి రాజగోపాల్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు  రేవంత్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.