
హుజూర్ నగర్ బైపోల్ అభ్యర్థిపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. తలో మాట మాట్లాడుతూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతి పేరును ప్రకటించారు. అయితే దీనిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తమ్ ఏకపక్షంగా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఉత్తమ్ పై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానన్నారు రేవంత్.