బీబీ నగర్ ఎయిమ్స్ కు వెంటనే టెండర్లు పిలవండి

V6 Velugu Posted on Sep 28, 2021

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిశారు.బిబి నగర్ ఎయిమ్స్ ఏర్పాటు గురించి మంత్రితో చర్చించారు. తక్షణమే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని వినతి పత్రం అందించారు. 798 కోట్ల విలువైన భవనాలు,మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరారు. టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. త్వరలో మూడో బ్యాచ్ విద్యార్థులు చేరనుండటంతో మౌలిక వసతుల ఏర్పాటు పై దృష్టి సారించాలని కేంద్రమంత్రిని  కోరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Tagged Union Minister, komatireddy venkat reddy, call tenders, BB Nagar Aims 

Latest Videos

Subscribe Now

More News