
చేర్యాల, వెలుగు: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో సోమవారం జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కలిసి పరామర్శించారు. నెల రోజుల కింద ఎర్రవల్లి లోని కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పల్లా కాలు జారి పడడంతో తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ నిర్వహించారు.
ఆస్పత్రిలో కొద్దిరోజులు చికిత్స పొందిన పల్లా మెయినాబాద్ లోని తన ఫామ్ హజ్ లో విశ్రాంతి తీసుకుంటుండగా సోమవారం కొమ్మూరి కలిశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు ఆగంరెడ్డి, లక్ష్మీనారాయణ, ఉపేందర్ శ్రీకాంత్, రాకేష్ కృష్ణ న్, నాని బాబు, మహేందర్ రెడ్డి, శివ శంకర్, సదానందం ఉన్నారు.