హైదరాబాద్, వెలుగు: ఆధునిక సౌకర్యాలు, టెక్నాలజీతో ప్రొఫెషనల్ స్పోర్ట్స్ సేవలు అందిస్తున్న గేమ్ పాయింట్ సంస్థ హైదరాబాద్ కొంపల్లిలో అత్యాధునిక మల్టీ -స్పోర్ట్స్ సెంటర్‌ను గురువారం ప్రారంభించింది. సిటీలో గేమ్ పాయింట్‌కు ఇది 13వ సెంటర్. ఇందులో బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్ వంటి క్రీడలకు ఇంటర్నేషనల్ లెవెల్ వసతులు ఉన్నాయి. అన్ని వయసుల వారికి ప్రొఫెషనల్ ట్రైనింగ్ అందించడమే కాకుండా బుక్ -అండ్ -ప్లే పద్ధతిలో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ ఫౌండర్స్ ఆదిత్య రెడ్డి, సిద్ధార్థ్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో మూడు కొత్త సెంటర్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
