హైదరాబాద్ కొంపల్లి మల్నాడు రెస్టారెంట్.. ఇక్కడ నుంచే సిటీలోని పబ్స్కు డ్రగ్స్ సప్లై

హైదరాబాద్ కొంపల్లి మల్నాడు రెస్టారెంట్.. ఇక్కడ నుంచే సిటీలోని పబ్స్కు డ్రగ్స్ సప్లై

హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ టీం పని మొదలుపెట్టేసింది. కొంపల్లిలోని  మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు గుర్తించింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య నేతృత్వంలో డ్రగ్ సరఫరా దందా నడుస్తున్నట్లు తేల్చింది. ప్రముఖ ఆసుపత్రిలోని కార్డియాలజీ డాక్టర్ ప్రసన్నకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు ‘ఈగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ టీం విచారణలో తేలింది. భీమవరం చెందిన డాక్టర్ ప్రసన్న ఇప్పటివరకు 20 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించింది.

సూర్య ఫ్రెండ్ హర్ష ద్వారా డాక్టర్ ప్రసన్న డ్రగ్స్ కొనుగోలు చేసింది. 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య  డ్రగ్స్ సరఫరా చేశాడు. ప్రముఖ పబ్లకు వెళ్లి డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాటు చేసేవి. ప్రిజం పబ్,  ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్ , బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్,  బ్రాడ్ వే పబ్ ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ‘ఈగల్’ టీం గుర్తించింది. వాక్ కోరా పబ్,  బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానుల పైన పోలీసులు కేసు నమోదు చేశారు.

క్వాక్ రాజా శేఖర, కోరా పబ్ పృద్వి వీరమాచినేని,  బ్రాడ్ వే  ఓనర్ రోహిత్ మాదిశెట్టి కేసు నమోదైంది. ఈ ముగ్గురు పబ్ యజమానులతో కలిసి సూర్య  పార్టీలు నిర్వహించినట్లు తెలిసింది. ములుగులోని రిసార్ట్లోకి ఫ్రెండ్స్ని పిలిచి పార్టీలు ఇచ్చినట్టు సూర్య విచారణలో చెప్పాడు. కొంపల్లిలో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో ‘ఈగల్’ టీం ఆకస్మిక దాడులు చేసింది.

ALSO READ : కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి

ఢిల్లీ నుంచి వచ్చిన మహిళల చెప్పుల మాటున డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ‘ఈగల్’ టీం దర్యాప్తులో వెల్లడైంది. లేడీస్ చెప్పుల్ హై హీల్స్ లోపల డ్రగ్స్ పెట్టి సూర్యకు నైజీరియన్స్ పార్సిల్ చేశారు. ఢిల్లీకి చెందిన నిక్కి, జెర్రీ నైజీరియన్లు కలిసి సూర్యకు డ్రగ్స్ పంపించినట్లు ‘ఈగల్’ టీం గుర్తించింది. మల్నాడు రెస్టారెంట్స్ యజమాని సూర్య, అతని మిత్రుడు హర్షలను ‘ఈగల్ టీం’ అరెస్టు చేసింది.