సనత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ టిమ్స్ అక్టోబర్లో పూర్తవ్వాలి : దామోదర

సనత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ టిమ్స్ అక్టోబర్లో పూర్తవ్వాలి : దామోదర
  • ఎట్టి పరిస్థితుల్లోనూఆలస్యం కావొద్దు: దామోదర

హైదరాబాద్, వెలుగు: టిమ్స్ ఆస్పత్రుల పనులను స్పీడప్ చేయాలని అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ‘‘హైదరాబాద్‌‌‌‌లోని సనత్‌‌‌‌నగర్ టిమ్స్‌‌‌‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ చివరి నాటికల్లా ఆస్పత్రి పనులన్నీ పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కావొద్దు” అని అన్నారు. ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ బీ, ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌ బీ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర సమీక్ష సమావేశం నిర్వహించారు. 

హైదరాబాద్‌‌‌‌లోని సనత్‌‌‌‌నగర్, ఎల్బీనగర్, కొత్తపేట టిమ్స్ హాస్పిటళ్లు, నిమ్స్ ఆస్పత్రి విస్తరణ, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై చర్చించారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ.. హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుంచే ప్రజలకు వైద్య సేవలందించే విధంగా ఎక్విప్‌‌‌‌మెంట్, ఫర్నీచర్ ముందే సమకూర్చుకోవాలని ఆదేశించారు. అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్స్ కొనుగోలు చేయాలని   సూచించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించుకోవాలన్నారు. కాగా, అల్వాల్‌‌‌‌, ఎల్బీనగర్ టిమ్స్‌‌‌‌ ఆస్పత్రుల పనులు మరో 6 నెలల్లో పూర్తవుతాయని మంత్రికి అధికారులు తెలిపారు. 

మెడికల్ కాలేజీల పనులపైనా ఆరా.. 

ఈ ఏడాది చివరికల్లా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపైనా ఆరా తీసిన ఆయన.. పీజీ  స్టూడెంట్స్‌‌‌‌కు కూడా అక్కడే హాస్టల్ సదుపాయం కల్పించాలని సూచించారు. మహబూబాబాద్‌‌‌‌, మంచిర్యాల, జనగామ, వనపర్తి మెడికల్ కాలేజీల బిల్డింగులను మరో 2 నెలల్లో పూర్తి చేస్తామని ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ బీ అధికారులు వెల్లడించారు. మిగిలిన కాలేజీల పనులను 8 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, టీజీఎంఎస్‌‌‌‌ఐడీసీ ఎండీ ఫణీంద్రరెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ సీఈలు రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.అక్టోబర్​లో పూర్తవ్వాలి