కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి

కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి

హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటన విషాదంగా మారింది. కల్తీ కల్లు తాగిన వారిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. బుధవారం (జులై 09) గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇద్దరు, ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మృతులు సీతా రామ్ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65)గా గుర్తించారు. మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్‌ సాయిచరణ్‌కాలనీకి చెందినవారిగా అధికారులు తెలిపారు.

హైదరాబాద్ కూకట్ పల్లిలో మంగళవారం (జులై 08) కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కూకట్​పల్లిలోని ఉషాముళ్లపూడి రోడ్డులో కల్లు కాంపౌండ్​, కేపీహెచ్​బీలోని హైదర్​నగర్,  ఎల్లమ్మబండ ప్రాంతంలోని కల్లు కాంపౌండ్ లో సాయంత్రం కొంతమంది కల్లు తాగారు. కాసేపటికి వారంతా అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీంతోపాటు బాధితులకు విరేచనాలు కూడా అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు వారిని కూకట్​పల్లిలోని రాందేవ్​ ఆసుపత్రికి తరలించారు. అక్కణ్నుంచి ప్రాథమిక చికిత్స అనంతరం నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ముగ్గురు చనిపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. 

కారకులను ఉపేక్షించేది లేదు: మంత్రి జూపల్లి

కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై  నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని బుధవారం మంత్రి జూపల్లి పరామర్శించారు. ఈ ఘటనలో  మొత్తం 19 మందికి అస్వస్థత గురైనట్లు తెలిపారు. నిమ్స్ లో 15 మంది, గాంధీ లో ఇద్దరు , ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇద్దరు కి చికిత్స  పొందతున్నట్లు చెప్పారు. 

కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందనీ.. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించి వైద్య అందిస్తున్నట్లు తెలిపారు. నిమ్స్ లో ఉన్న 15 మంది పరిస్ఠితి నిలకడ గా ఉందని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్ లు సీజ్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా కల్లు కాంపౌండ్ నిర్వాహకులను అరెస్టు చేశామని అన్నారు. 

కల్తీ కల్లుతో ప్రజల ఆరోగ్యాలను రిస్క్ లో పెట్టిన నిర్వాహకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపెక్షేంచికేది లేదని హెచ్చరించారు మంత్రి జూపల్లి. కల్లు శాంపిల్స్ ను కెమికల్ టెస్ట్ కోసం ల్యాబ్ కి పంపించినట్లు చెప్పారు. ఈ ఘటనపైఎక్సైజ్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 


నిమ్స్ లో చికిత్స పొందుతున్న పేషంట్ల పేర్లు:

 శ్రీశైలం 45
 యాదగిరి 45
 కాలేశ్వరరావు 58 
 మాధవి 42..
 కోటేశ్వరరావు 58
 పెంటేష్ 43
పోచమ్మ 74..
 లక్ష్మి 84
 మౌనిక 27 
 దేవదాస్ 69..
 రాములు 49 
గోవిందమ్మ 61
మనప్ప 55
నరసింహ 29
యెబు 55