రాయేదో.. రత్నమేదో గుర్తించి ఓటెయ్యండి :  జబర్దస్త్  ఫేమ్ కొమురక్క 

రాయేదో.. రత్నమేదో గుర్తించి ఓటెయ్యండి :  జబర్దస్త్  ఫేమ్ కొమురక్క 

షాద్ నగర్,వెలుగు: సేవాగుణం కలిగిన నాయకుడు ఒకవైపు, ప్రజలను ఇబ్బందులు పెట్టి దోచుకునే నాయకులు మరోవైపు ఉన్నారని, రాయేదో రత్నమేదో ప్రజలు గుర్తించి ఓటెయ్యాలని ‘జబర్దస్త్’ ఫేమ్ కొమురక్క సూచించారు. షాద్ నగర్ లో ధర్మానికి, అధర్మానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతుగా తిమ్మాపూర్, సంగిగూడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.

విష్ణువర్ధన్ రెడ్డి కరోనాకాలం  నుంచి తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ.. పేదలకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. సేవామార్గంలో ఎంతోమంది ఆటంకాలు సృష్టించినా వెనకడుగు వేయకుండా ప్రజాక్షేత్రంలో ఉన్నాడని చెప్పారు.  ఈనెల 30న సింహం గుర్తుకు ఓటు వేసి విష్ణువర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మోహన్ సింగ్, మల్ రెడ్డి మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నాయక్ ఉన్నారు.