కొమురవెల్లి మల్లికార్జున స్వామి .. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి .. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి నిత్యాన్నదాన పథకానికి ఆదరణ పెరుగుతోందని  మల్లన్న ఆలయ ఈవో  ఎస్.అన్నపూర్ణ అన్నారు.  నిత్యాన్నదాన పథకానికి  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామానికి చెందిన దాతలు అమూరు అనసూయ రాజయ్య దంపతులు రూ.లక్ష చెక్కును ఆలయ ఈఓ ఎస్. అన్నపూర్ణకు అందజేశారు. 

కార్యక్రమంలో ఏఈఓ బుద్ది శ్రీనివాస్, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు శ్రీరాములు, జూనియర్ అసిస్టెంట్ మధుకర్ పాల్గొన్నారు.