Adhurs 2: అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంటేసి నిరాహార దీక్ష చేస్తా : కోన వెంకట్

Adhurs 2: అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంటేసి నిరాహార దీక్ష చేస్తా : కోన వెంకట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), డైరెక్టర్ వి.వి. వినాయక్(V.V. Vinayak) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్(Adurs). ఎన్టీఆర్ కెరీర్‌లో గుర్తుండిపోయే మూవీస్ లో అదుర్స్ ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్ గా అదుర్స్ 2 (Adhurs2) ఖచ్చితంగా తెరకెక్కిస్తానంటూ నమ్మకంగా చెప్పుకొచ్చారు రైటర్,ప్రొడ్యూసర్ కోన వెంకట్. 

వివరాల్లోకి వెళితే..బుధవారం (ఏప్రిల్ 3న) అంజలి కీ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కోన వెంకట్ మాట్లాడారు. అదుర్స్ 2 గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. మీడియా సమావేశంలో భాగంగా ఓ జర్నలిస్ట్ అడుగుతూ..రవితేజ వెంకీ సినిమాకి సీక్వెల్ చేయాలనుకుంటున్నారా? అని అడగగా..కోన వెంకట్ స్పందించారు. "రవితేజ వెంకీ 2 సంగతి అయితే ఇప్పటికి తెలియదు కానీ, ఎన్టీఆర్ తో అదుర్స్ 2 మాత్రం చేయాలని ఎప్పట్నుంచో గట్టిగా నిర్ణయించుకున్నానని ఆయన అన్నారు. 

అందుకు అదుర్స్ 2 మూవీ చేయడం కోసం ఎలాగైనా ఎన్టీఆర్‌ను ఒప్పించేందుకు సిద్ధమని..అవసరమైతే తారక్ (ఎన్టీఆర్) ఇంటి ముందు టెంట్ వేసి..పిలక పెట్టుకొని నేను నిరాహార దీక్ష చేసైనా సరే..అతడితో అదుర్స్ 2 చేయిస్తా. ఎందుకంటే “ఎన్టీఆర్ను మించి అదుర్స్ 2 చేసేవాడు లేడు. తెలుగు ఇండస్ట్రీ అని కాదు..మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరూ లేరు.ఆ క్యారెక్టర్,ఆ ఆహార్యం,ఆ మాడ్యులేషన్..ఆ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్‌లాగా చేసే వారు ఇండియాలోనే లేరు” అని కోన వెంకట్ ఈ సందర్బంగా చెప్పారు.

అలాగే ఈ సినిమా సీక్వెల్కు కూడా డైరెక్టర్గా వినాయక్ గారే ఉంటారని అన్నారు.ప్రస్తుతం కోన వెంకట్ అదుర్స్ 2 అప్డేట్ ఇవ్వడంతో చారీ ఫ్యాన్స్ ఆకాశం అంతఎత్తుకి ఎగిరి గంతులేస్తున్నారు.చారీ పాత్ర అంతలా ఆకట్టుకుంది మరి. 

ALSO READ :- నా ఫోన్ కూడా ట్యాప్ అయింది.. నందకిషోర్ కీలక వ్యాఖ్యలు

చారి అనే బ్రాహ్మణుడి క్యారెక్టర్లో..ఎన్టీఆర్ తన సహజ నటనతో ఆకట్టుకున్నారు. తనదైన కామిక్ యాంగిల్ తో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. అంతేకాకూండా బ్రహ్మానందం శిష్యుడిగా ఎన్టీఆర్ అదరగొట్టి..ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాతో బ్రహ్మీ..ఎన్టీఆర్ కాంబో అంటే స్పెషల్ క్రేజీ సొంతం చేసుకుంది.అదుర్స్ మూవీ నందమూరి ఫ్యాన్స్ కు పిచ్చ క్రేజీ కావడంతో..వెండితెరపై మళ్లీ చూడాలని చాలా రోజులుగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మొత్తానికి ఇన్నాళ్లకు అదుర్స్ 2 పై కోన ఖచ్చితమైన మాటలతో నందమూరి ఫ్యాన్స్ లో జోష్ పెంచారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు.