
వికారాబాద్, వెలుగు: కోణార్క్ఎక్స్ప్రెస్రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. వికారాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ హరిప్రసాద్తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోనిసనత్నగర్కు చెందిన కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి(42) గురువారం పల్నాడు ఎక్స్ప్రెస్ రైలులో వికారాబాద్వస్తున్నాడు. రైలు గొల్లగూడ రైల్వే స్టేషన్లో ఆగింది. మోహన్‌రెడ్డి ట్రైన్దిగాడు. కాసేపటికే రైలు స్టార్ట్అయి వెళ్లిపోయింది. దీంతో అతను అక్కడే ఉండిపోయాడు. వెనకాలే వచ్చిన కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టడంతో మోహన్‌రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు.