తెలంగాణ బడ్జెట్లో భారీ అవినీతి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణ బడ్జెట్లో భారీ అవినీతి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

సీఎం కేసీఆర్ నేతృత్వంలో  ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో భారీ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు.  శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలో  నూతనంగా నిర్మించిన బీజేపీ  కార్యాలయాన్ని  ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  పేరు మార్చుకున్న టీఆర్ఎస్ ను ప్రజలు త్వరలోనే తరిమి కొడతారని అన్నారు.  వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు.  కేసీఆర్ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం 17 వేల కోట్లు ఇచ్చిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారులకు  డబుల్ బెడ్రూం ఇళ్లను అందించలేదని విమర్శించారు.