కొడంగల్, వెలుగు: కొడంగల్పట్టణంలో ఎన్‌హెచ్163 పక్కనే ఉన్న శ్రీనాగ ఎల్లమ్మ వైన్స్లో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గురువారం ఉదయం గమనించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించి, సీసీ ఫుటేజీ పరిశీలించారు. దుండగుడు షాపుపై ఉన్న ఇనుప రేకులను తొలగించి లోపలికి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది. షాపులోని రూ.60 వేల 20, 10, 5 కాయిన్స్ ఉన్న బ్యాగులు, రూ.10 వేల విలువైన లిక్కర్బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
