కొండపొలం ట్రైలర్: మృగాలపైనే కాదు.. మానవత్వంలేని మనుషులపై..!

కొండపొలం ట్రైలర్:  మృగాలపైనే కాదు.. మానవత్వంలేని మనుషులపై..!

ఉప్పెన హిట్ తో మంచి ఊపుమీదున్న వైష్ణవ్ తేజ్ రకుతో కలిసి కొండపొలం అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ట్రైలర్ సోమవారం రిలీజైంది. 
ట్రైలర్ లో రవీంద్ర యాదవ్ గా వైష్ణవ్ తేజ్ కనిపించగా.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పల్లెటూరి అమ్మాయి ఓబులమ్మగా ఆకట్టుకుంది.  నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన యువకుడిగా వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఆయన తండ్రి పాత్రలో సాయిచంద్ .. తాత పాత్రలో కోట శ్రీనివాసరావు కనిపిస్తున్నారు. తాము ఉన్న చోటున గొర్రెలను మేపుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో, కొండపొలం చేసుకోవడానికి వెళ్తారు. అక్కడ వాళ్లకి క్రూరమృగాలతో పాటు అంతకంటే భయంకరమైన మనుషుల వలన సమస్యలు ఎదురవుతాయి. అప్పుడు హీరో మృగాలపైనే కాదు .. మానవత్వంలేని మనుషులపై కూడా తిరగబడతాడు. కథాకథనాలు కొత్తగా అనిపిస్తున్నాయి. అక్టోబర్ 8 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.