
మూడు నెలలుగా సిర్పూర్ నియోజకవర్గంలో ఫారెస్ట్ అధికారుల ఆగడాలు మితిమీరిపోయాయని ఆరోపించారు స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. సీఎం పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పినా ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. కాగజ్ నగర్ మండలం సార్సాల గ్రామంలో తమ భూమిలో విత్తనాలు నాటుతుండగా ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేశారని చెప్పారు కోనప్ప. ఒక మహిళా అధికారిపై దాడి జరగడం బాధాకరం అన్నారు. ఘటన వెనుక కోనేరు కృష్ణారావు ఉన్నారని కొందరు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు కోనప్ప.
“50 మంది పోలీస్ సిబ్బందిని తీసుకొచ్చి .. యుద్ధ వాతావరణం సృష్టిస్తూ చెట్లు పెట్టేందుకు అటవీ అధికారులు ప్రయత్నించారు. రైతులు పత్తి విత్తనాలు పెట్టుకునే కాగజ్ నగర్ మండలంలోని భూముల్లో .. కౌటారం మండలంలోని ట్రాక్టర్లు తీసుకొచ్చి.. దున్నించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా. దౌర్జన్యంగా భూములు దున్నటం వల్లే.. రైతులు తిరగబడ్డారు. ఇంత దౌర్జన్యం గతంలో చూడలేదు. సార్సాల గ్రామ రైతులు, స్థానికులు బతిమిలాడినా .. అధికారులు దున్నడం వల్లే దురదృష్టకర సంఘటన జరిగింది” అన్నారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.