‘‘మాకు ఇదొక మైల్‌స్టోన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఈ సినిమాతో చిరంజీవి గారు ఒక కొత్త టాలెంట్ బాక్స్‌ని ఓపెన్ చేసినట్లుగా అనిపించింది. ‘రౌడీ అల్లుడు’ తరహా వింటేజ్ ఛార్మ్‌ని గుర్తు చేస్తూనే ఈ జనరేషన్‌ను మెప్పించేలా ఆయన నటన చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. స్ర్కిప్ట్‌కు బాగా కనెక్ట్ అవడంతో ఒక కొత్త మీటర్‌లో ఆయన నటించారు.
ఇప్పటికీ కొత్త నటుడ్నే అనుకుని సీన్స్ చేస్తారు. అలాగే వెంకటేష్ గారు బిగ్ ఇంపాక్ట్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఫన్ మరింతగా రైజ్ అవుతుంది. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న రిచ్ క్యారెక్టర్ వెంకీ గారిది. ఇద్దరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా వారి పెర్ఫార్మెన్స్‌లు ఉంటాయి.
సినిమాలోని ఏ సీన్ చూస్తున్నా ఆడియెన్స్ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ఫన్ కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా రియల్‌గా ఉంటుంది. సెన్సార్ సభ్యులు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. క్లీన్ ఫిల్మ్‌గా రిపోర్ట్ ఇచ్చారు. పిల్లలు, ఫ్యామిలీతో కలిసి అందరూ చూసే సినిమా అని చెప్పారు.
ఈ సినిమాకి సంక్రాంతి విందు అనేది చిన్న మాట. సంక్రాంతి రేసులో చాలా సినిమాలు వస్తున్నా మాకు రన్నింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అందుకే థియేటర్స్ సమస్య పెద్దగా లేదు. ఫైనల్‌గా చిరంజీవి గారి నుంచి ఏమైతే మిస్ అయ్యామో అవన్నీ ఇందులో ఉంటాయి’’.
‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో చిరంజీవి వింటేజ్ పెర్ఫార్మెన్స్‌తోపాటు కొత్త తరహా యాక్టింగ్‌ను చూస్తారని నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల అన్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల చెప్పిన విశేషాలు.
