పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి :  ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
  •     ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​

కోరుట్ల, వెలుగు: పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి  కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్​ తెలిపారు. బుధవారం కోరుట్ల, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి లో తెలంగాణ పెన్షనర్స్​అసోసియేషన్​, తెలంగాణ రిటైర్డ్​ ఎంప్లాయీస్​అండ్​ టీచర్స్​అసోసియేషన్​ ఆధ్వర్యంలో వేర్వేరుగా పెన్షనర్స్ -డే నిర్వహించారు. 

ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షనర్లకు అండగా నిలబడడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. పెన్షనర్లకు గౌరవం, భద్రత, వారి సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. అనంతరం 2026 క్యాలెండర్, డైరీ అవిష్కరించారు. కార్యక్రమంలో ఆయా పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు, పెన్షనర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు  పాల్గొన్నారు.