కోటక్ బిజ్ ల్యాబ్స్ సీజన్ 2 ప్రారంభం.. 75పైగా స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు మద్దతు

కోటక్ బిజ్ ల్యాబ్స్  సీజన్ 2 ప్రారంభం..  75పైగా స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు మద్దతు

హైదరాబాద్​, వెలుగు: కోటక్ మహీంద్రా బ్యాంక్  కోటక్ బిజ్​ల్యాబ్స్ యాక్సిలరేటర్ కార్యక్రమం రెండో సీజన్​ను ప్రారంభించింది. ఇది ప్రారంభ దశలోని స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు డీప్ మెంటర్‌‌‌‌‌‌‌‌షిప్, మార్కెట్ యాక్సెస్, ఫండింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తుంది. 

అక్టోబర్​ 2025 నుంచి నవంబర్​ 2026 వరకు జరిగే సీజన్ 2లో డీప్-టెక్, సస్టైనబిలిటీ, క్లీన్ ఎనర్జీ, ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ వంటి రంగాలపై దృష్టి సారిస్తుంది. దేశవ్యాప్తంగా 75కిపైగా స్టార్టప్‌‌‌‌‌‌‌‌లకు మద్దతు ఇస్తుంది. 

ఐఐటీ ఢిల్లీకి చెందిన ఎఫ్​ఐటీటీతో పాటు ఐఐఎంఏ వెంచర్స్, ఎన్​ఎస్​ఆర్​సీఈఎల్, టీ-–హబ్ వంటి సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాయి. కోటక్ బిజ్​ల్యాబ్స్ సీజన్ 1లో 32 స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు గ్రాంట్లు అందుకున్నాయి.