కేపీహెచ్ బీని మూడు ముక్కలు చేయొద్దు.. గాంధీ విగ్రహం వద్ద కాలనీవాసుల నిరసన

కేపీహెచ్ బీని మూడు ముక్కలు చేయొద్దు.. గాంధీ విగ్రహం వద్ద కాలనీవాసుల నిరసన
  • గాంధీ విగ్రహం వద్ద కాలనీవాసుల నిరసన

కూకట్​పల్లి, వెలుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా పేరొందిన కేపీహెచ్​బీ కాలనీని జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో మూడు ముక్కలుగా చేయడంపై కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. కాలనీ మొదటి రోడ్డు గాంధీ బొమ్మ వద్ద శుక్రవారం వారు నిరసన చేపట్టారు. కాలనీని మూడు డివిజన్లుగా (కేపీహెచ్​బీ, బాలాజీ నగర్, వసంత నగర్) విభజించడంతో 46 ఏండ్ల చరిత్ర కలిగిన కేపీహెచ్​బీ అస్తిత్వం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

రోడ్ నంబర్ 1 నుంచి జేఎన్టీయూ రోడ్డు వరకు కేపీహెచ్​బీ డివిజన్-1గా, జేఎన్టీయూ రోడ్డు నుంచి కల్వరి టెంపుల్ వరకు డివిజన్-2గా మార్చాలని కోరారు. కార్యక్రమంలో కట్టా నరసింగరావు, కొల్లా శంకర్, షేక్ సత్తార్, నారాయణరావు, రాచకొండ భాస్కర్, ముప్పాళ్ల సాంబశివరావు పాల్గొన్నారు.