ఎంపీ కొడుకునంటూ.. మాయమాటలతో చీటింగ్.. కేపీహెచ్బీ లో గుంటూరు వ్యక్తి అరెస్ట్..

ఎంపీ కొడుకునంటూ.. మాయమాటలతో చీటింగ్.. కేపీహెచ్బీ లో గుంటూరు వ్యక్తి అరెస్ట్..

కూకట్​పల్లి, వెలుగు: వీఐపీ ముసుగులో పలువురిని మోసగిస్తున్న వ్యక్తిని కేపీహెచ్​బీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వాయిల వెంకటేశ్వర్లు(29) కొంతకాలంగా నగరంలో డాక్టర్​, జ్యెవలరీ షాపు ఓనర్, ఎంపీ కొడుకునంటూ తిరుగుతున్నాడు. విక్రాంత్​రెడ్డి పేరుతో డాక్టర్​ అవతారం ఎత్తాడు. ఎంపీ కొడుకునంటూ కొందరిని నమ్మించాడు. ఇలా పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు. 

కేపీహెచ్​బీ కాలనీలో ఓ హాస్టల్​ నిర్వాహకురాలిని పరిచయం చేసుకున్నాడు. తనకు జూబ్లీహిల్స్​లో జ్యువెలరీ షాపు ఉందని నమ్మించాడు. రీమోడలింగ్​ చేయిస్తానని నమ్మించి 4 తులాల గోల్డ్​ చైన్​ తీసుకున్నాడు. ఇంకొంచెం గోల్డ్​ అవసరమని చెప్పి మరో రూ.లక్ష వసూలు చేశాడు. ఆ తర్వాత ఫోన్​ స్విచాఫ్​ చేసి పరారయ్యాడు. సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.