
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డిని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ నియమించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కేసీఆర్ సోమవారం లేఖలు పంపించారు. ఆ లేఖ పత్రాలను తన నివాసంలో సురేశ్‌రెడ్డికి అందజేశారు. ప్రస్తుతం కేకే(కేశవరావు) బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేకే స్థానంలో సురేశ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సురేశ్‌రెడ్డిని ఫ్లోర్ లీడర్‌గా గుర్తించాలని కోరుతూ రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్స్‌కు లేఖలు పంపించారు.