
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రకటించి 6 నెలలైనా.. ఇప్పటి వరకు ఆ బోర్డు నిశానా(పత్తా) లేదని రాజ్య సభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి అన్నా రు. గురువారం రాజ్యసభలో అగ్రిక ల్చర్ గ్రాంట్స్ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
నిజా మాబాద్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో టర్మరిక్ బోర్డు, టర్మరిక్ రీసెర్చ్ సెంట ర్లను కేంద్రం ప్రకటించిందన్నారు. ఆ రెండింటిని ఎందుకు లింక్ చేసి, ప్రారంభించలేదని ప్రశ్నించారు.