ఏపీలోని వైజాగ్​కు బోర్డు తరలింపు

ఏపీలోని వైజాగ్​కు బోర్డు తరలింపు
  • కృష్ణా బోర్డు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ భేటీ వాయిదా
  • ఏపీలోని వైజాగ్​కు బోర్డు తరలింపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కృష్ణా బోర్డు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ(ఆర్​ఎంసీ) ఐదో సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 28న సమావేశం నిర్వహించాల్సి ఉండగా అదే సమయానికి బ్రజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కేడబ్ల్యూడీటీ) విచారణ ఉండటంతో సమావేశం వాయిదా వేయాలని కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్సీ కోరారు. దీంతో సమావేశం అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 17కు వాయిదా వేస్తున్నట్టు బోర్డు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ గురువారం సభ్యులకు లేఖ రాశారు. గత రెండు నెలలుగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ ఐదో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిదా పడుతూ వస్తున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుల రూల్ కర్వ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెయింటనెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రాజెక్టులు సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యే రోజుల్లో రెండు రాష్ట్రాలు ఉపయోగించుకునే నీటి వినియోగంపై ఆరుగురు సభ్యులతో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీని ఏర్పాటు చేశారు. మొదటి రెండు సమావేశాలకు తెలంగాణ సభ్యులు డుమ్మా కొట్టగా, తర్వాత జరిగిన రెండు సమావేశాలకు హాజరై తెలంగాణ రాష్ట్రం తరఫున తమ అభిప్రాయాలు వెల్లడించారు. నాలుగు సమావేశాల్లో చర్చించిన అంశాలపై తుది నిర్ణయం తీసుకొని కృష్ణా బోర్డుకు నివేదిక ఇవ్వడానికి ఐదో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించాలనుకున్నారు. అయితే.. ఇప్పటికే సమావేశం ఐదుసార్లు వాయిదా పడింది. ఆరోసారికైనా జరుగుతుందా, వాయిదా పడుతుందా అనే చర్చ కృష్ణా బోర్డులో సాగుతున్నది.

ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు..

కృష్ణా బోర్డును ఏపీకి తరలించేందుకు రంగం సిద్ధమైంది. విశాఖపట్నంలోని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐఈఐ) బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేయనున్నారు. బోర్డును ఏపీకి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. రెండో అపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. కృష్ణా బోర్డు ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జలసౌధలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం అద్దె లేకుండా బోర్డు ఏర్పాటుకు స్థలం కేటాయించింది. సుమారు రూ.2 కోట్లు ఖర్చు చేసి బోర్డు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ ఫ్రీ అకామిడేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్పించాలని బోర్డు పలుమార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వైజాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సరిపడా ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనందున ఐఈఐలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. త్వరలోనే కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ టీం ఆ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోనుంది.

నెలకు రూ.8.50 లక్షల అద్దె

కృష్ణా బోర్డు నిర్వహణకు 17 వేల చదరపు అడుగుల స్థలం అవసరమని లెక్కగట్టారు. తొలి దశలో 7 వేల ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్టీ ఇచ్చేందుకు ఐఈఐ ఓకే చెప్పింది. చదరపు అడుగుకు రూ.50 అద్దె చొప్పున ప్లగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే సిస్టంలో బోర్డు నిర్వహణకు అనువుగా సౌకర్యాలు సమకూర్చి ఇస్తామని తెలిపింది. బోర్డు కోరినట్టు 17 వేల ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్టీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే, అందుకు టైం పడుతుందని చెప్పింది. పూర్తి స్థాయి స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి వస్తే నెలకు రూ.8.50 లక్షల రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లించాల్సి ఉంటుంది. చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బోర్డు సభ్యులకు అకామిడేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాళ్ల విమాన చార్జీలు సహా ఇతర నిర్వహణ ఖర్చులు మొత్తం తెలంగాణ, ఏపీ చెరిసగం భరించాల్సి ఉంటుంది.